Revanth Reddy: కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష

CM  Revanth Reddy high-level review at Telangana secretariat soon
x

Revanth Reddy: కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష

Highlights

Revanth Reddy: ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Revanth Reddy: ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో రివ్యూ చేయనున్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం కసరత్తు చేస్తున్నారు. వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేపట్టనున్నారు. భూముల విలువ పెంపు తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధును రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories