Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌

CM Revanth Reddy Focus On Lok Sabha Elections
x

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌

Highlights

Revanth Reddy: అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Revanth Reddy: మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్‌ రెడ్డి. అందులో భాగంగా 5 జిల్లాల్లోని 7 పార్లమెంట్‌ స్థానాలపై సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల నేతలతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఏడు స్తానాల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories