Revanth Reddy: సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలి

Cm Revanth Reddy Appreciates Chiranjeevi To Supporting For Drugs Free Telangana
x

Revanth Reddy: సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలి

Highlights

Revanth Reddy: డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

Revanth Reddy: డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. గంజాయి మత్తులో చిన్న పిల్లలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రగ్స్ సరఫరా పెరిగిందన్న రేవంత్.. వీటిని ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ చేస్తే అవార్డ్స్‌ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి.

ఇక డ్రగ్స్‌ నివారణపై అవగాహన వీడియో చేసిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు రేవంత్. డ్రగ్స్ నివారణకు సంబంధించి సినీ ఇండస్ట్రీ కూడా ముందుకు రావాలని కోరారు సీఎం. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీ.. తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని థియేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలన్నారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories