TS Investments: తెలంగాణలో పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధులు చర్చలు

Cm Revanth Reddy Adani Representative Meeting Discussed Investments
x

TS Investments: తెలంగాణలో పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధులు చర్చలు

Highlights

TS Investments: తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న సీఎం రేవంత్‌రెడ్డి

TS Investments: తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. సెక్రెటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పోర్ట్స్- సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశీష్ రాజ్ వన్షీలతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories