Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12400 కోట్ల పెట్టుబడులు

Adani Group: రూ. వెయ్యి కోట్లతో డ్రోన్‌ సిస్టం మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సెంటర్‌

Shekhar G
Published on: 17 Jan 2024 12:56 PM IST
CM Revanth Met With Gautam Adani in Davos
X

Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12400 కోట్ల పెట్టుబడులు

Adani Group: తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా కొనసాగుతోన్న సీఎం రేవంత్ దావోస్‌ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగాయి. పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీతో సమావేశమయ్యారు. తెలంగాణలో 12 వేల 4 వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ మీద 5 వేల కోట్లు.. అదానీ కనెక్ట్‌‌ డేటా సెంటర్‌పై మరో 5 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు జరిగాయి. అంబుజా సిమెంట్స్‌ తెలంగాణలో 14 వందల కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. వెయ్యి కోట్లతో డ్రోన్‌ సిస్టం మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది అదానీ గ్రూప్‌.

Shekhar G

Shekhar G

Next Story