CM Revanth Reddy: పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం

CM Revanth Reddy: పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం
x

CM Revanth Reddy: పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం

Highlights

CM Revanth Reddy: హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే..

CM Revanth Reddy: హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సీఎస్సార్‌ ఫండ్స్‌తో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున, ఆ అంశంపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories