సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

CM KCRs Dussehra Gift to Singareni Employees | TS News
x

సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

Highlights

*లాభాల్లో 30శాతం వాటా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం

CM KCR: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండగలోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. అర్హులైన కార్మికులకు 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021-22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండిShow Full Article
Print Article
Next Story
More Stories