CM KCR: రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR Will Visit Nalgonda District Tomorrow
x

CM KCR: రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

Highlights

CM KCR: దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పరిశీలన

CM KCR: నల్లగొండ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దామరచర్ల మండలం వీర్లపాలెంలో జరుగుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ప్లాంట్ లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా, పనులను వేగం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాల నివేదికలను సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి, జెన్‎కో, జిల్లా ఉన్నతాధికారులు‎ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ కూడా వచ్చే అవకాశం ఉండడంతో.. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు హెలీప్యాడ్లు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు, ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది కావడంతో ఈ ప్లాంట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు.‎ ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండరును భెల్‌ సంస్థ దక్కించుకుంది. మొత్తం ‎29వేల992 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు నిర్మిస్తున్నారు.

దీని నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. వీటిలో మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరుకల్లా ప్రారంభిస్తామని జెన్‌కో వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండో ప్లాంటు, 2024లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఈ మహాధర్మల్ పవన్ ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. ఒకటీ, రెండు ప్లాంట్లలో పరెలె శరవేగంగా జరగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కావడంతో దీని నిర్మాణాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయితే రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని ప్రభుత్వ అంచనా వేస్తోంది. 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా... ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్‌కోకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories