ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

* ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభించనున్న కేసీఆర్

R Tripura Malini
Published on: 12 Dec 2022 6:38 AM IST
CM KCR Will Go To Delhi Today
X

ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

CM KCR: రాజకీయపార్టీ పేరు మార్చిన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసేందుకు ఐదురోజులపాటు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ముందస్తుగానే పార్టపేరు మార్పుకోసం దరఖాస్తుపెట్టుకున్న సమయంలోనే కార్యాలయం ఏర్పాటు పనులు ప్రారంభించారు. భారత్ రాష్ట్రసమితి పేరు మారిన తర్వాత హైదరాబాద్ లో ఆవిర్భావోత్సవం నిర్వహించిన కేసీఆర్ ఢిల్లీలో ఈ నెల 14న ఢిల్లీలో BRS పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేక విశ్వాసం ఉన్న కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు సైతం హస్తినకు వెళ్లనున్నారు. ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి రేపు బయల్దేరి వెళ్లనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story