CM KCR: తెలంగాణలో మరో బ్యారేజీ నిర్మిస్తామన్న సీఎం

CM KCR Will Build Another Barrage In Telangana
x

CM KCR: తెలంగాణలో మరో బ్యారేజీ నిర్మిస్తామన్న సీఎం

Highlights

CM KCR: కొత్తగా బ్యారేజీ నిర్మించాలని కర్షకుల వినతి

CM KCR: పొరుగు రాష్ట్రం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టులను వెనక్కి తీసుకోకుంటే.. తెలంగాణలో మరో బ్యానేజీ నిర్మించి.... రోజుకు మూడు టీఎంసీల నీటిని తోడేస్తాం... ఆ బ్యారేజీని వెలటూరు - గొందిమల్ల మధ్య నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్‍ మాటలు ఆ ప్రాంత ప్రజలను ఆనందంలోకి నెట్టాయి... దీంతో తమ సమస్యలు గట్టెక్కుతాయని అక్కడి రైతులు భావించారు. కేసీఆర్‍ ఆ మాటలు చెప్పి రెండేళ్లు గడుస్తున్నా... ఇప్పటివరకు కొత్త బ్యారేజీ నిర్మాణం మాట ఊసే లేదు. ఇంతకీ ఆ కొత్త బ్యారేజీ ఎక్కడ నిర్మించాలనుకున్నారు..? ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఏ సందర్భంలో ఆ కొత్త బ్యారేజీ ఊసెత్తారు...?

రెండేళ్ల క్రితం కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అపెక్స్ కమిటీ మీటింగ్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీ ప్రాజెక్టులు అనధికారికంగా కడుతున్నారంటే, మీ ప్రాజెక్టులంటూ వాడీ వేడిగా చర్చించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఓ సవాల్ విసిరారు. పొరుగు రాష్ట్రం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టులను వెనక్కి తీసుకోకుంటే, తెలంగాణ పరిధిలో కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం మధ్య మరో బ్యారేజీ నిర్మించి... రోజుకు మూడు టీఎంసీల నీటిని తోడేస్తామన్నారు. దాన్ని వెలటూరు - గొందిమల్ల లేదా అలంపూర్ - పెద్ద మారూర్ మధ్యలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. దీనిపై అసెంబ్లీలో కేసీఆర్‍ బహిరంగ ప్రకటన కూడా చేశారు. దీంతో కొల్లాపూర్‍, అలంపూర్‍ ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని దోపిడీ చేస్తోందన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ వెలటూరు - గొందిమల్ల మధ్యలో బ్యారేజీ నిర్మించి నీటి నిల్వ చేసుకోవడంతోపాటు బ్యారేజీపై వంతెన నిర్మిస్తామని ప్రకటించారు. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు ఓ సంస్థ ద్వారా సర్వే చేయించారు. సీఎం కేసీఆర్.. సాగుకు యోగ్యమైన భూములు అపారంగా ఉన్నా.. నీరందక, ఈ రెండు ప్రాంతాలు కేవలం వర్షాధార పంటలకే పరిమితమయ్యాయి. ఎగువన అలంపూర్ కోసం ఆర్డీఎస్, కొల్లాపూర్ కోసం జూరాల ప్రాజెక్టు ఉన్నా... పొలాలకు నీరందని పరిస్థితి ఉందని అంటున్నారు రైతులు....

వెలటూరు - గొందిమల్ల గ్రామాలకు చెందిన ప్రజలు వర్షాకాలంలో మరబోటులో ప్రయాణిస్తున్నారు. ఇరు గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనాలతో కృష్ణా తీరం వరకు వెళ్లి... అక్కడి నుంచి వాహనంతో పాటు మర బోటులో వెళ్తుంటారు. తిరుగు ప్రయాణంలోనూ మరబోట్లనే ఆశ్రయిస్తుంటారు. గతంలో అనేక సార్లు కృష్ణా నదిలో పుట్టీలు, మరబోట్లు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ఇక్కడ వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తీరుతాయని ప్రాంతవాసులు అంటున్నారు.

శ్రీశైలం ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టు.. మనకన్నా ఏపీ ఎక్కువ భాగం నీటిని తోడుకుంటోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి, సంగమేశ్వరం వద్ద కొత్త ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి నీటిని తరలిస్తే.. 30 రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందని, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీరందని పరిస్థితి ఉంటుంది. వీటితో పాటు నాగార్జునసాగర్‌కు చుక్క నీరు కూడా వెళ్లదు. జూరాల - శ్రీశైలం మధ‌్య కేవలం తెలంగాణ భూభాగంలో మాత్రమే ఉండేలా బ్యారేజీ నిర్మిస్తే బాగుంటుంది. జూరాల నుంచి రెండు వైపులా ఇరవై టీయంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయిర్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ బ్యారేజీ విషయానికి వస్తే, రోజుకు మూడు టీఎంసీల నీటిని తోడి.. కల్వకూర్తి, పాలమూరు రంగారెడ్డి పథకాలకు అనుసంధానం చేయాలని కూడా అంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మరో నలభై టీఎంసీల నీటిని నిలిపే రిజర్వాయిర్లు నిర్మించాలని కోరుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ నీటిని నిలప గలిగితే, రాష్ట్ర వాటా 299 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.....

Show Full Article
Print Article
Next Story
More Stories