CM KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR visit to Sangareddy District today
x

CM KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Highlights

CM KCR: ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు టౌన్‌షిప్

CM KCR: డబుల్ బెడ్‌రూం స్కీంలో కీలక ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద వీకర్ సెక్షన్ కాలనీ నిరుపేదలకు అందుబాటులోకి రాబోతోంది. గ్రేటర్ పరిసరాల్లోని సంగారెడ్డి జిల్లా కోల్లూరు వద్ద GHMC భారీ ఎత్తున డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఒక్క కొల్లూరులో ప్రాంతంలోనే 15,660 ఇళ్లను నిర్మించారు అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంత భారీ నిర్మాణం మరెక్కడా జరగలేదు. అంతే కాదు దేశంలోనే వీకర్ సెక్షన్ హౌజింగ్‌లో ఇన్ని వేల ఇళ్లు ఒకే చోట ఎక్కడా నిర్మించిన దాఖలాలు లేవని అధికారులు చెప్తున్నారు. మొత్తం 117 బ్లాకుల్లో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఎట్టకేలకు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేయాలని సంకల్పించుకుంది. అందులో భాగంగా వివిద ప్రాంతాల్లో 2 BHK ఇళ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి RCపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన 15,660 గృహాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి.

వీటిని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 1,432.50 కోట్ల వ్యయంతో ఒకేచోట 15,660 ఇండ్లను నిర్మించారు. సుమారు లక్ష జనాభా నివాసం ఉండేలా ఒకేచోట ఏకంగా ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సకల హంగులతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన అపార్టుమెంట్లకు ఏమాత్రం తీసిపోకుండా సకల సౌకర్యాలతో వీటిని నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories