కాసేపట్లో నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR Visit to Nizamabad District
x

కాసేపట్లో నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన 

Highlights

CM KCR: సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవం

CM KCR: కాసేపట్లో సీఎం కేసీఆర్నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం గిరిరాజా కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా నిజామాబాద్ గులాబీమయం అయ్యింది. టీఆర్ఎస్ జెండాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. జాతీయ రహదారి పొడవునా భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు.

మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్లమ్మగుట్టలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రాంభిస్తారు. అనంతంరం బహిరంగ సభా వేదికపైకి కేసీఆర్ చేరుకుని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యవేక్షించారు. పోలీసు ఉన్నతాధికారులు భారీ బందో బస్తు ఏర్పా్టు చేశారు. జాతీయ రాజకీయాలతో పాటు, ఇటీవల బీజేపీ నేతలు విమర్శల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నారన్న దానిపైనే అందరు దృష్టి సారించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సీఎం పాల్గొననున్న బహిరంగ సభకు భారీగా తరలి రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories