CM KCR: రెండో రోజు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR visit to Maharashtra on the Second Day
x

CM KCR: రెండో రోజు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ పర్యటన

Highlights

CM KCR: పండరీపురంలో విఠేశ్వరస్వామిని దర్శించుకోనున్న కేసీఆర్‌

CM KCR: మహారాష్ట్రలోని సోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అక్కడి బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సోలాపూర్‌కు చెందిన నేత భగీరథ బాల్కే.. ఇతరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కొందరు స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు కేసీఆర్‌ను కలిశాయి. సోలాపూర్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ధర్మన్న సాదుల్ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు ఘనస్వాగతం పలికిన సాదుల్.. కుటుంబసభ్యులను పరిచయం చేశారు.

రాత్రి సోలాపుర్‌లో బస చేసిన కేసీఆర్,.. ఇవాళ ఉదయం పండరీపురం వెళ్లనున్నారు. అక్కడి విట్టల్ రుక్మిణీ దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విఠలేశ్వరునికి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి సర్కోలి వెళ్తారు. అక్కడ బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, నేతలు తుల్జాపూర్ వెళ్లి... తుల్జాభవానీ అమ్మవారి దేవస్థానానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories