CM KCR: మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

CM KCR Unveiled the Statue of Mahatma Gandhi
x

CM KCR: మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

Highlights

CM KCR: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో గాంధీ విగ్రహావిష్కరణ

CM KCR: గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌‌లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పార్క్‌లైన్‌ ,ప్యాట్నీ సిగ్నల్‌, క్లాక్‌ టవర్‌, సంగీత్‌, చిలకలగూడా చౌరస్తా మీదుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుంటారు. అనంతరం గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories