కాసేపట్లో బీహార్‌కు సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR to Visit Bihar
x

కాసేపట్లో బీహార్‌కు సీఎం కేసీఆర్‌ పర్యటన

Highlights

CM KCR: గాల్వాన్‌లో అమరులైన వీరజవాన్‌ కుటుంబాలకు ఆర్థిక సాయం

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుండి పాట్నాకు బయలుదేరి వెళ్తారు. గతంలో ప్రకటించిన విధంగా గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్‌కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ అందజేయనున్నారు.

పట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. చెక్‌లు పంపిణీ చేసిన తరువాత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. గతకొద్దీ రోజులుగా బీహార్ రాజకీయాలు వేగంగా మారుతూవచ్చాయి. బీజేపీ సపోర్ట్‌తో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ RJDతో సహా ఇతర పార్టీలతో కలిసి సీఎం పగ్గాలు చేపట్టారు. దాదాపు వారం రోజుల పాటు బీహార్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకి దారి తీశాయి.

ప్రస్తుత పర్యటనలో మరోసారి ఇరువురు నేతలు భేటి కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ వస్తున్న కేసీఆర్.. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలు, రైతు చట్టాలు, మోటార్లు వద్ద మీటర్లు పెట్టడం, రాష్ట్రల హక్కులను హరించడంపై ఇరువురు చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories