Telangana: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

KCR Key Meeting On Party MLAs
x

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Highlights

Telangana: మరికాసేపట్లో ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఆపార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు‌.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తుండటంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి పోటీ చేయనునున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆమె పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. సురభి వాణీదేవి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నల్గొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రకటించి, బీఫాం అందజేశారు. రెండో స్థానంలో అభ్యర్థి ఎంపికపై సీఎం సుదీర్ఘ కసరత్తు అనంతరం..పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించి వాణీదేవిని ఎంపిక చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories