ప్రధానితో భేటీ కానున్న సీఎం కేసీఆర్.. దిశ హత్యపై చర్చించే అవకాశం

ప్రధానితో భేటీ కానున్న సీఎం కేసీఆర్.. దిశ హత్యపై చర్చించే అవకాశం
x
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కెసిఆర్
Highlights

రెండు తెలుగు రాష్ట్రలలోనే కాకుండా దేశవాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రలలోనే కాకుండా దేశవాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రముఖులు కూడా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో బేటీ కానున్నారు. దిశ హత్యాచార ఉదంతంపై చట్టాల్లో సమూల మార్పులు, నిందితులకు కఠిన శిక్షల అమలుకు కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని కేసీఆర్ ప్రధాని మోదీని కోరనున్నట్లు తెలిస్తోంది. ముఖ్యమంత్రి కేనీఆర్‌ సోమవారం రాత్రి ఢిల్లీకి పయనమైయ్యారు. మంగళవారం ప్రధానిని కలిసేందుకు సమయం కోరారు. కీలక పలు అంశాలు మోదీకి విన్నవించనున్కనారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా దిశ హత్యాచారోదంతం, విభజన హామీలు, ఆర్టీసీ పరిణామాలను వివరించొచ్చని సమాచారం. అత్యాచార నిందితుల్లో శిక్షించేందుకు చట్టాల్లో మార్పులు చేసి సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరనున్నట్ల తెలసుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories