CM KCR: రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ తయారు చేస్తాం

CM KCR Speech At Medical College In Warangal
x

CM KCR: రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ తయారు చేస్తాం

Highlights

CM KCR: వైద్యరంగంలో కేంద్రం నిర్లక్ష్యం వహించినా ముందుకెళుతున్నాం

CM KCR: కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో నిర్లక్ష్యం వహించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడకుండా వైద్య, ఆరోగ్య రంగాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారాయన.... వరంగల్ లో ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా సభలో మాట్లాడారు. రాష్ర్టంలో హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలనే గొప్ప సంకల్పం తీసుకున్నామని తెలిపారాయన.... రాష్ర్టంలోని 119 నియోజకవర్గాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు పూర్తయితే... ఎక్కడ ఎవరికయినా ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఎదురయినా వారి హిస్టరీ అందుతుందని, వైద్య సేవలను అందించడానికి వీలవుతుందన్నారు.

గతంలో తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష వహించినా... జిల్లాకొకటి చొప్పున 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

2014 కు ముందు 2800 మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పడు 6500 సీట్లు వచ్చాయన్నారు. మెడికల్ పీజీ సీట్లు గతంలో 1150 ఉండేవని, ఇప్పుడు 2500 పీజీ సీట్లు పెరిగాయన్నారు. యువత రష్యా, ఉక్రెయిన్ దేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories