వ్య‌వ‌సాయ‌శాఖ‌లో మ‌రో రెండు ప్ర‌త్యేక విభాగాల ఏర్పాటు : సీఎం

వ్య‌వ‌సాయ‌శాఖ‌లో మ‌రో రెండు ప్ర‌త్యేక విభాగాల ఏర్పాటు : సీఎం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని వ‌్య‌వ‌సాయ‌శాఖ‌లో మ‌రో రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ వ్యవసాయశాఖపై ప్రగతిభవన్‌లో...

తెలంగాణ రాష్ట్రంలోని వ‌్య‌వ‌సాయ‌శాఖ‌లో మ‌రో రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ వ్యవసాయశాఖపై ప్రగతిభవన్‌లో శుక్రవారం సమీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేయాలన్నారు. ఒక విభాగం మార్కెటింగ్ పై దృష్టి పెట్టాల‌ని, మరో విభాగం సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాలను పర్యవేక్షించాలని తెలిపారు. మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లయీస్, వ్యాపారులతో సమన్వయం కుదుర్చుకొని రైతులకు మంచిధర వచ్చే విధంగా వ్యూహాలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఏ పంటవేస్తే రైతులకు లాభం? తదితర విషయాలను అధ్యయనం చేయాల‌న్నారు. ఈ రెండు విభాగాలకు ఐఏఎస్ అధికారులు నేతృత్వం వహించాలని అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో రైతులు ఇప్పటిదాకా కొన్నిరకాల పంటలు వేయడానికి మాత్రమే అలవాటు పడ్డారని కాగా ఈ పద్ధతి మారాలని సీఎం అన్నారు. వరి, పత్తితో పాటు కొన్ని పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సి అవ‌స‌రం ఉంద‌ని సీఎం అన్నారు. మార్కెట్‌లో మంచి ధర వచ్చే పంటలు వేయాల‌న్నారు. నిర్ణీత పంటల సాగు విధానాన్ని సూచిస్తున్నది అందుకే అని తెలిపారు. నీటి లభ్యత, భూముల రకం, వాతావరణం, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎప్పటికప్పుడు ఏ పంటలు వేయాలనే విషయంలో అధికారులు దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కందుల సాగు 20 నుండి 25 లక్షల ఎకరాల వరకు సాగవ్వాలి. 12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్, 15 లక్షల ఎకరాల్లో మిరప, పసుపు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పంటలు సాగవ్వాల‌న్నారు.

గోదావరిపై నిర్మించిన కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయ‌ని సీఎం తెలిపారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట,సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాలు గోదావరి ప్రాజెక్టుల కింద కవర్ అవుతున్నాయని ఈ ప్రాంతాల‌కు ఇక‌ సాగునీటికి ఢోకా ఉండద‌న్నారు. దీనికి అనుగుణంగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాల‌ని, పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి సీఎం సూచించారు. ఒక్కో ప్రాజెక్టు ఒక్కో సమయంలో నిండటం వల్ల ఆయా ప్రాంతాల్లో పంటకాలాల్లో స్వల్ప తేడాలు ఉంటాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories