రేపు కరోనా, పది పరీక్షలపై సీఎం కేసీఆర్ సమీక్ష

రేపు కరోనా, పది పరీక్షలపై సీఎం కేసీఆర్ సమీక్ష
x
CM KCR(File photo)
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు వరుస సమీక్షాసమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం కరోనా కట్టడి, పదో తరగతి పరీక్షలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు వరుస సమీక్షాసమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం కరోనా కట్టడి, పదో తరగతి పరీక్షలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

రేపు మధ్యాహ్నం రెండు గంటలకు పదో తరగతి పరీక్షల అంశంపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు హాజరుకానున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్నిచోట్లా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పది పరీక్షలనే వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్స్ చర్చించిన తర్వాత ప్రభుత్వం టెన్త్ పరీక్షల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక సోమవారం మధ్యాహ్నం 4.30 గంటలకు కరోనా మీద సమీక్షించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు మంత్రులతో చర్చిస్తారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రగతిభవన్‌లో కరోనా కట్టడిపై జరిగే ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సోమవారంతో తొలగించనున్నారు. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోగా, బార్డర్ లో బందోబస్తు ఏర్పాటైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పేరుగుదల దృష్ట్యా ఈ సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories