CM KCR: వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

CM KCR Review On Regularization And Adjustment Of VRAs
x

CM KCR: వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

Highlights

CM KCR: వీఆర్ ఏలను వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది

CM KCR: రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నీటి పారుద‌ల స‌హా ఇత‌ర శాఖ‌ల్లో వీఆర్ఏల‌ను స‌ర్దుబాటు చేసే విష‌య‌మై ఆయన చ‌ర్చిస్తున్నారు. వీఆర్ ఏలను వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వీఆర్ ఏల భర్తీ కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి.. వీఆర్ ఏల భర్తీపై ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించింది. అయితే..

కేసీఆర్ తో భేటీ అనంతరం వీఆర్ ఏల భర్తీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories