భద్రాచలానికి హెలికాప్ట‌ర్ తరలించండి.. సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు..

CM KCR Review meeting on Godavari Floods in Bhadrachalam
x

భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

Highlights

*భద్రాచలానికి హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి పంపాలని ఆదేశం

CM KCR: భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. తక్షణమే భద్రాచలానికి హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. అలాగే భద్రాచలం దగ్గర సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్‌, రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. భ‌ద్రాచ‌లంలో క్షేత్ర‌స్థాయిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను స్థానిక మంత్రి పువ్వాడ అజ‌య్ ప‌రిశీలిస్తున్నారు. వ‌ర‌ద బాధితుల‌ను ర‌క్షించేందుకు లైఫ్ జాకెట్లు, త‌దిత‌ర ర‌క్ష‌ణ సామాగ్రిని త‌ర‌లించాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతోన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories