తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ
x

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Highlights

*ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ, ప్రమోషన్లపై చర్చించాలని నిర్ణయం *త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించాలని ఆదేశం *పది రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తిచేయాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, పీఆర్‌సీ, ప్రమోషన్లపై వెంటనే త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారం పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తిచేయాలని సీఎస్‌ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

మరోవైపు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో.. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత మరింత పెరిగిందని సీఎం అన్నారు. ఈ రెండుశాఖల పనితీరులో గుణాత్మక, గణనీయ మార్పు రావాలని చెప్పారు. వ్యవసాయశాఖ కాగితం, కలం శాఖగా కాకుండా పొలం, హలం శాఖగా మారాలని సూచించారు. సాగులో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులు తీసుకువచ్చేందుకు వ్యవసాయశాఖ మరింత కృషి చేయాలన్నారు.

రైతులు పండించిన పంటలను ఇబ్బంది లేకుండా మార్కెట్‌లో అమ్ముకునేలా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాల దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినా.. తెలంగాణలో మాత్రం మరింత బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పదిరోజుల్లోగా ఏ గుంటలో ఏ పంట వేశారో పూర్తి లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు.KCR

Show Full Article
Print Article
Next Story
More Stories