కరోనా ఎఫెక్ట్‌ : తెలంగాణలో విద్యా సంస్థలు, మాల్స్‌ బంద్

కరోనా ఎఫెక్ట్‌ : తెలంగాణలో విద్యా సంస్థలు, మాల్స్‌ బంద్
x
Highlights

కరోనాతో తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా మన దేశంలో పుట్టిన వ్యాధి కాదని..ఇతర దేశాల నుంచి వచ్చిన ఓ...

కరోనాతో తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా మన దేశంలో పుట్టిన వ్యాధి కాదని..ఇతర దేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వచ్చింది. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జన సమర్ధనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏ ఒక్కరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇంటర్, ఎస్సెస్సీ ఇతర పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్షలు రాసే విద్యార్ధులకు హస్టల్ వసతి కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యేకమైన సానిటరీ ఏర్పాట్లు చేపట్టాలని ఆరోగ్య శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.

కరోనాపై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా నివారణ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం 500 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో కరోనా నిధులు ఉంటాయని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఎయిర్ పోర్టులో స్ర్కీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారని చెప్పారు.

రాష్ర్ట వ్యాప్తంగా ఒక వెయ్యి బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 240 వెంటిలెటర్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ర్టంలో నాలుగు కొరైంటైన్ హాస్పిటల్ ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. పంచాయితీరాజ్, మున్సిపల్ ఫారెస్ట్, పోలీసు అధికారులతో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తారు. మార్చి 31 వరకు రాష్ర్టంలోని మ్యారేజ్ హాల్స్ మూసి వేయాలని నిర్ణయించాం. 200 మంది బంధువులతో శుభకార్యం జరుపుకోవాలని సూచించారు.

ఇండోర్, అవుట్ డోర్ స్పోర్ట్స్ స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్ పార్కులు మూసి వేస్తారని చెప్పారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు యథాతధంగా నడుస్తాయని చెప్పారు. కరోనాపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాలు మాత్రమే వెల్లడించాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories