Telangana Formation Day: అమరవీరులకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

CM KCR Paid Tributes at Martyrs Memorial Stupa in Gun Park
x

Telangana Formation Day:(The Hans India) 

Highlights

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాలుర్పించారు.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా ప్రగతిభవన్‌ చేరుకొని ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగుర వేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు.

ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరుసగా రెండో సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా సాగుతున్నాయి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రం, సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవవనరులను కలిగి దని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి, స్వయం సమృద్ధి సాధించాలని కోరుతున్నట్లు చెప్పారు. దేశంలో తన వంతు పాత్రను రాష్ట్రం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ ప్రజలు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రజల కృషితో కరోనా నుంచి త్వరలో బయటపడతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories