ప్రభుత్వశాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా క్యాబినెట్‌ నిర్ణయం

CM KCR On VRA | TS News
x

ప్రభుత్వశాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా క్యాబినెట్‌ నిర్ణయం

Highlights

VRA: విఆర్ఎల రెగ్యులరైజ్ విధివిధానాలపై చర్యలకు సీఎం ఆదేశాలు

VRA: విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ విషయం పై కేబినేట్ లో నిర్ణయం తీసుకున్న అనంతరం విఆర్ఏ జెఎసి ప్రతినిధులను తన ఛాంబర్ కు ఆహ్వానించి సీఎం వారితో చర్చించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న విఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories