విపక్షాలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Kcr Nagarjunasagar Tour
x

కెసిఆర్ (ఫైల్ ఫోటో )The hans India

Highlights

*ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి: కేసీఆర్‌ *మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది: కేసీఆర్‌ *మేమేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదు: కేసీఆర్‌

నల్గొండ సభలో విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. మా సహనానికి కూడా హద్దుంటుందన్న కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పిచ్చిపిచ్చి మాటలు మానకుంటే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. నల్గొండలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకపోతే ఓట్లు అడగం అంటూ సంచలన కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో నల్గొండ ప్రజలకు నీళ్లిస్తామని తెలిపారు. 25 వందల కోట్లతో ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపిన సీఎం.. ఏడాదిన్నరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు వివరించారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నల్గొండ ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం స్పష్టం చేశారు.

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయితీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామ సర్పంచ్‌లకు ప్రోత్సాహాలు ప్రకటించిన సీఎం.. ఒక్కో పంచాయితీకి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేసీఆర్.. నల్గొండ జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీకి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులకు సంబంధించిన జీవో రేపే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories