KCR: టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

CM KCR Meeting With TRS Leaders on Huzurabad By-Elections
x
టీఆర్ఎస్ నాయకులతో సీఎం కెసిఆర్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

KCR: ప్లీనరీ, హుజురాబాద్ ఉపఎన్నికపై చర్చ

KCR: టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ ప్లీనరీ, హుజురాబాద్ ఎన్నికపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ర్ట అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 25న టీఆర్ఎస్ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక జరగనున్నది. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరపున ఆరు సెట్ల నామినేషన్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాఖలు చేశారు. కేసీఆర్ పేరును హోంమంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా మంత్రులు బలపర్చారు.

కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఉమ్మడి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, అధ్యక్ష ఎన్నికతో పాటు హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, దళిత బంధు లాంటి అంశాలను చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories