ఢిల్లీ టూర్‌లో సీఎం కేసీఆర్ వరుస భేటీలు

ఢిల్లీ టూర్‌లో సీఎం కేసీఆర్ వరుస భేటీలు
x
Highlights

ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.... కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను కలిసిన కేసీఆర్.... రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం సహకారంపై చర్చించారు.

ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.... కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను కలిసిన కేసీఆర్.... రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం సహకారంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీరు ఎత్తిపోసేందుకు అనుమతులు మంజూరుచేయాలని కోరారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకే మాత్రమే అనుమతి ఉందన్నారు. దాదాపు గంటపాటు సాగిన సమావేశంలో, ఏపీ చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.

షెకావత్‌తో భేటీ ముగిశాక, వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై అమిత్‌షాకు నివేదిక అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎన్నడూలేనంతగా వరదలు విధ్వంసం సృష్టించాయని తెలిపారు. అకాల వర్షాలు, వరదల కారణంగా 13వేల కోట్లకు పైగా నష్టం జరిగిందన్న సీఎం కేసీఆర్...... కేంద్ర, రాష్ట్ర అధికారుల నివేదికల ఆధారంగా వెంటనే విపత్తు సహాయాన్ని విడుదల చేయాలని అమిత్‌‌షాను కోరారు. అలాగే, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

రేపు, ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండనున్న సీఎం కేసీఆర్.... ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరారు. అలాగే, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి, నరేంద్రసింగ్ తోమర్ తోనూ సీఎం కేసీఆర్ సమావేశంకానున్నారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతిపత్రాలు అందజేసి... నిధులు విడుదల చేయాలని కోరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories