కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్

కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్
x
Highlights

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని ఆయన నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. 30 రోజుల ప్రణాళిక విజయవంతమైందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన జనంలో వచ్చిందని, దీని కారణమైన గ్రామ కార్యదర్శులు, డీపీవోలు, డీఎల్ పీవోలు, సర్పంచులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.

ప్రతీ నెల పంచాయతీలకు రూ.339 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని వెల్లడించారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని ఆయన నిర్ణయించినట్లుగా తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలు రూపకల్పన చేయాలని సీఎం ఆదేశాల జారీ చేశారు. విద్యుత్ సమస్యనుః సిబ్బంది విజయవంతంగా ఎదుర్కొన్నామని సీఎం వ్యాఖ‌్యానించారు. అన్ని శాఖల్లో కంటే మొదటి స్థానంలోవిద్యుత్ శాఖ నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories