Bandi Sanjay: తెలంగాణలో రజాకారుల పాలనను సీఎం కేసీఆర్ చూపిస్తున్నారు

Bandi Sanjay: ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ జైళ్లలో పెట్టిస్తున్నాడు

R Tripura Malini
Published on: 1 Dec 2022 4:16 PM IST
CM KCR Is Showing The Rule Of Kings In Telangana Quotes Bandi Sanjay
X

తెలంగాణలో రజాకారుల పాలనను సీఎం కేసీఆర్ చూపిస్తున్నారు

Bandi Sanjay: తెలంగాణలో రజాకారుల పాలనను సీఎం కేసీఆర్ చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ జైళ్లలో పెట్టిస్తున్నాడని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు పెట్టే టెన్షన్‌కు ప్రస్తుతం కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టడంలేదన్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ టీఆర్ఎస్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ సర్కార్ ముంపు గ్రామ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదని బండి సంజయ్ విమర్శించారు. నిర్మల్ ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి ప్రజల చేతిలో చిప్పను పెట్టాడని బండి సంజయ్ ఆరోపించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story