ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయం ప్రారంభం

CM KCR Inaugurates Telangana Secretariat On February 17th
x

ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయం ప్రారంభం

Highlights

*తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Telangana: తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం చేతుల మీదుగా నూతన సచివాలయం ప్రారంభిస్తామని మంత్రి వేముల తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. నూత‌న స‌చివాల‌యానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విష‌యం తెలిసిందే.

150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మిస్తున్న ఈ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ప్రస్తుతం బిల్డింగ్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఫ్లోరింగ్‌, ఫాల్‌సీలింగ్‌, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories