తెలంగాణలో జాబుల జాతర.. 50 వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో జాబుల జాతర.. 50 వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
x
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల వరకు ఖాళీలున్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వాటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని సీఎం సూచించారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది.

తెలంగాణలో త్వరలో కొలువుల జాతర మొదలవనుంది. ఒకే సారి 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అందుకోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఉపాధ్యాయ, పోలీస్‌ శాఖలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులంన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల వరకు ఖాళీలున్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వాటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని సీఎం సూచించారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని సీఎం ఆదేశించారు. ఇంకా ఏ ఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలని సీఎం తెలిపారు. ఇలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్‌లు విడుడల చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories