CM KCR: ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ యాదాద్రికి రానున్నారు

CM KCR Going to Yadadri on This Month 14th
x

ఈ నెల 14న యాదాద్రి వెళ్లనున్న సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ యాదాద్రికి రానున్నారు

CM KCR: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ యాదాద్రికి రానున్నారు. ఐదున్నర ఏళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. త్వరలో ప్రధానాలయంలో లక్ష్మీనారసింహుడు భక్తులను దర్శనమివ్వనున్నారు. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. స్వామి వారి కైంకర్యాలకు ఉద్దేశించిన పుష్కరిణిని సిద్ధం చేశారు. దిగువన మరో పుష్కరిణి కూడా పూర్తి కావస్తోంది. నలుదిక్కులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం కూడా సిద్ధమైంది.

సీఎం కేసీఆర్ ఈ నెల 1 ఢిల్లీ వెళ్లారు. 3న ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి రావాలని కోరారు. దీనికి ప్రధానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు. మరోపైపు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం ఆలయ పనులను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు.

సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామిని మరోసారి సంప్రదించి ఆలయ పున: ప్రారంభంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. 15 కాటేజీల అన్ని పనులు పూర్తయ్యాయి. కేసీఆర్ ఆదేశాలతో మరో వారం రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కిషన్ రావు చెబుతున్నారు. కల్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఘట్ కేసర్ వరకు ఉన్న ఎం ఎం టీ ఎస్ ట్రైన్ ను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. యాదాద్రి గుట్ట కింది నుంచి ఆలయం దగ్గరకు ఫ్రీ ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా మూడు హెలిప్యాడ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories