Top
logo

CM KCR: కాసేపట్లో ఢిల్లీకి సీఎం కేసీఆర్

CM KCR Going to Delhi For Set up a Party Office
X

కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కెసిఆర్

Highlights

CM KCR: రేపు ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

CM KCR: కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినబాట పట్టనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈసారి మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలవనున్నారు. అనంతరం మూడో తేదిన హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఢిల్లీలో స్థలం ఇచ్చింది కేంద్రం. 2020 అక్టోబర్ 9న 1300 చదరపు మీటర్ల భూమిని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు ఢిల్లీ వసంత్ విహార్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజకి ఏర్పాట్లు చేశారు. ప్రొక్లెయిన్ తో రాళ్లను తొలగింపు, మట్టి చదును పనులు చేశారు. సెప్టెంబర్ 2న ఈ స్థలంలో భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు కానుంది.

Web TitleCM KCR Going to Delhi For Set up a Party Office
Next Story