KCR: ఉద్యమ సమయంలో కామారెడ్డిలో కూలీగా పని చేశా

CM KCR Full Focus on Kamareddy
x

KCR: ఉద్యమ సమయంలో కామారెడ్డిలో కూలీగా పని చేశా

Highlights

KCR: కామారెడ్డిపై సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్

KCR: కామారెడ్డి నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. గజ్వేల్‌తో పాటు.. కామారెడ్డిలోనూ విజయకేతనం ఎగురవేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కామారెడ్డి బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమై..ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఏమైనా విభేదాలు ఉంటే పక్కన పరిష్కరించుకుని.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరిస్తూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్.

నామినేషన్ తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. కామారెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి నుంచే జలసాధన ఉద్యమం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో కామారెడ్డిలో కూలీగా పని చేశానన్నారు. కామారెడ్డికి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నామని.. ఇంకా చాలా వస్తాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామాల రూపు రేఖలే మారుతాయన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డికి రెండేళ్లలో సాగు నీరు తేస్తానని భరోసా ఇచ్చారు.

కామారెడ్డి అల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో.. నో టెన్షన్ అంటున్నారు కారు పార్టీ నేతలు. రేవంత్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కేసీఆర్ గెలుపును ఆపలేరని ధీమాగా ఉన్నారు. మొన్నటి వరకు కామారెడ్డి మాస్టర్ ప్లాన్..కొంత వరకు బీఆర్‌ఎస్‌ను కలవర పెట్టినా.. రద్దు ప్రకటనే శాంతించారు అక్కడి రైతులు. దీంతో బీఆర్ఎస్‌కు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగినట్టైంది. కేసీఆర్ వస్తే.. కామారెడ్డి మరింత అభివృద్ది చెందుతుందని.. మరో గజ్వేల్‌లా డెవలప్‌మెంట్‌లో దూసుకుపోతుందని ఆశిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. గజ్వేల్‌లో కేసీఆరే సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో.. అక్కడ బీఆర్ఎస్‌కు పెద్దగా ఇబ్బంది లేదంటున్నారు గులాబీ నేతలు. గజ్వేల్‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధే అయనను.. హ్యాట్రిక్ కొట్టేలా చేస్తుందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories