గులాబీ వ్యూహం..డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో..

గులాబీ వ్యూహం..డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో..
x
Highlights

గులాబీ దళం పంథా మార్చబోతుందా..? తెలంగాణలో పొలిటికల్ సవాల్ విసురుతున్న కాషాయ పార్టీకి చెక్ పెట్టాలని యోచిస్తున్నారా..? టీఆర్ఎస్ వేస్తున్న అడుగులు...

గులాబీ దళం పంథా మార్చబోతుందా..? తెలంగాణలో పొలిటికల్ సవాల్ విసురుతున్న కాషాయ పార్టీకి చెక్ పెట్టాలని యోచిస్తున్నారా..? టీఆర్ఎస్ వేస్తున్న అడుగులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో గులాబీ బాస్ పార్టీ సంస్థాగత అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశాలున్నాయి.

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో టీఆర్‌ఎస్‌ బలోపేతం చేయాలని యోచిస్తున్న గులాబీ దళపతి తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మార్చేందుకు పక్కా వ్యూహం రచిస్తున్నారు. గురువారం టీఆర్ఎస్ రాష్ర్ట కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పార్టీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు. రాజ్యసభ, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, వివిద కార్పొరేషన్ చైరన్లను సమావేశానికి ఆహ్వానించారు.

మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనకు వచ్చారు కేసీఆర్. గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చూట్టాలని నిర్ణయించారు. కోటి మందికి సభ్యత్వం కల్పించే విధంగా నేతలకు టార్గెట్ పెట్టనున్నారు కేసీఆర్. పార్టీ సభ్యులుగా సభ్యత్వం తీసుకునే వారి ఆధార్, మొబైల్ నెంబర్ సేకరించనున్నారు. రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించి తామే బలమైన రాజకీయ శక్తిగా ఉన్నామనే సంకేతాలు జాతీయ స్థాయిలో వెళ్లేలా చేయాలని భావిస్తున్నారు.

మరో వైపు గులాబీ శ్రేణులకు కమలం పార్టీ నేతలు గాలం వేయడానికి ముందే కళ్లెం వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పదవులు, నామినేట్ పదవలు భర్తీ చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అబివృద్ధి పథకాలు ప్రజల్లోకి చేరే విధంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తానికి పార్టీ బలోపేతం చేయడంతో పాటు రాబోయో రోజుల్లో మనుగడ సాధించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories