CM KCR: సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తలుచుకుంటే భయమేస్తుంది

CM KCR Fire on Central Government | TS News
x

CM KCR: సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తలుచుకుంటే భయమేస్తుంది

Highlights

CM KCR: కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది

CM KCR: రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్‌ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారన్నారు. విద్యుత్‌ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని సీఎం గుర్తుచేశారు.

శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్‌ మాట్లాడారు. దేశాల విద్యుత్‌ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందన్నారు.''పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారు. విద్యుత్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. ఇరు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్‌ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారు.

సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారు. 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్‌ తెచ్చారు. శాసనసభకు ప్రతిపాదించకుండానే కర్కశంగా 7 మండలాలను ఏపీకి అప్పగించారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారు'' అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories