ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR  Delhi Tour
x

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్

Highlights

CM KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన అఖిలేష్ యాదవ్

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్ మూడు రోజులుగా హస్తినలో మకాం వేయడం పట్ల రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరిని శాలువా కప్పి సన్మానించారు. తాజా పరిణామాలు, జాతీయ రాజకీయాల ఇతర కీలక అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ నూతన రాష్ట్రపతి ద్రౌదిముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని ప్రచారం సాగినప్పటికీ ఆయన రాష్ర్టపతి భవన్ వైపు వెళ్లలేదు. ఢిల్లీ పర్యటనలో ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు.

నిజానికి ఢిల్లీ పర్యటనలో తొలిరోజే నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం కేసీఆర్ కలుస్తారనే ప్రచారం సాగింది. కాని కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మూడు రోజులైనా ఆయన రాష్ట్రపతి భవన్ వెళ్లలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇక మూడు రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. దీంతో ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణలో పీకే టీమ్ చేసిన సర్వేపై ఆయన కసరత్తు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. తాజా పరిణామాలు, జాతీయ రాజకీయాలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అఖిలేష్‌ను కలిసినప్పుడు ఆయన బాబాయ్, సమాజ్‌వాదీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, కేసీఆర్ సమీప బంధువు ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని, అందరూ కలిసి లంచ్ చేశారని సమాచారం. కొంతకాలంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అనేక పార్టీల అధినేతలను, పలు రాష్ట్రాల సీఎంలను కలుస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ తీవ్రంగా కృషిచేస్తున్నారు. మోదీని వ్యతిరేకించే నేతలతో నిరంతరం సమావేశాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే అఖిలేష్‌తో సమావేశమయ్యారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన కేంద్రంగా కీలక చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఎస్పీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్‌ తో కలిసిన కేసీఆర్ ను కలిసిన అఖిలేష్ దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.

జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన కేంద్రంగా కీలక చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఎస్పీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్‌ తో కలిసిన కేసీఆర్ ను కలిసిన అఖిలేష్ దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. ఇద్దరి మధ్య జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. తన నివాసానికి వచ్చిన అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం దేశ రాజకీయాలపై చర్చించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజులు ప్రశ్నించడం, పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై దాడులు వంటి అంశాలపైనా కేసీఆర్, అఖిలేష్ యాదవ్ మాట్లాడుకున్నారని చెబుతున్నారు. మోడీ సర్కార్ విపక్ష నేతలను టార్గెట్ చేస్తుందని , ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను ప్రయోగిస్తోందని కేసీఆర్, అఖిలేష్ యాదవ్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories