KCR Review Meeting on Irrigation Department: 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు: సీఎం కేసీఆర్‌

KCR Review Meeting on Irrigation Department: 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు: సీఎం కేసీఆర్‌
x
సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో
Highlights

KCR Review Meeting on Irrigation Department: తెలంగాణలో మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.

KCR Review Meeting on Irrigation Department: తెలంగాణలో మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. జలవనరులశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నీటిపారుదలశాఖను ఇకపై జలవనరులశాఖ (వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌) గా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరుగాలని సీఎం చెప్పారు. ఇందుకోసం అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయరాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సీఎం చెప్పారు.

అధికారులు సీఎం కేసీఆర్ కు తెలంగాణలో మారిన సాగునీటిరంగం పరిస్థితికి తగ్గట్టుగా జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూపొందించిన ముసాయిదాను అందించారు. ఈ ముసాయిదాను పరిశీలించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులను సూచించారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిరోజూ గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు లిఫ్ట్‌చేసి అవసరమైన వ్యవస్థను సిద్ధంచేయాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచించారు. ఇక ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేందర్‌రావు, అనిల్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, హరిరాం, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పలువురు సీఈలు పాల్గొన్నారు.

జలవనరులశాఖలో మార్పులపై సీఎం కేసీఆర్‌ సూచనలు, ఆదేశాలు...

సీఈలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని సూచించారు. ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్ట్‌హౌజులు నిర్మించాలని ఆయన తెలిపారు.

విద్యుత్‌శాఖకు అన్ని పంప్‌హౌజ్‌ల నిర్వహణ బాధ్యత అప్పగించాలని తెలిపారు.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల దగ్గర ఆపరేషన్‌ మాన్యువల్స్‌ రూపొందించన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలన్నారు.

ప్రభుత్వం ఎంతో కష్టపడి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తుందని, 1.25 కోట్ల ఎకరాలకు వాటి ద్వారా నీరందించాలన్నారు. జలవనరులశాఖ దీనికి తగ్గట్టుగా సంసిద్ధం కావాలన్నారు.

సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో కచ్చితమైన లెక్కలు తీయాలని సూచించారు. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories