CM KCR: కేంద్ర సర్కారు తీరును తీవ్రంగా విమర్శించిన కేసీఆర్

CM KCR Comments On Central Government
x

CM KCR: కేంద్ర సర్కారు తీరును తీవ్రంగా విమర్శించిన కేసీఆర్

Highlights

CM KCR: సంస్కరణలు అమలైతే మోడీని ఇంటికి పంపడం ఖాయం

CM KCR: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ చట్టాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. కేంద్ర చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీ సర్కారే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల గురించి ఆలోచించకుండా.... బడా షావుకార్ల మేలు కోసం సంస్కరణలు అనే అందమైన పేరు తగిలిస్తున్నారన్నారు. ఇప్పటికే ఓడరేవులు, విమానాలు, రైల్వేలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం.. కీలకమైన వ్యవసాయం, విద్యుత్‌ రంగాలపై కన్నేసిందని.. ఆ రెండు రంగాల ద్వారా వచ్చే లాభాలను తన మిత్రులకు కట్టబెడుతున్నారన్నారు. ఈ సంస్కరణలు అమలైతే.. దేశప్రజలు మోడీని ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. మొన్న మునుగోడు బహిరంగ సభలో అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వాలను ఉంచబోమనని నిస్సిగ్గుగా ప్రకటించారని.. ఇదేమి ప్రజాస్వామ్యమని కేసీఆర్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories