CM KCR: ఆపరేషన్ మెదక్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR Begins Operation Medak
x

CM KCR: ఆపరేషన్ మెదక్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

Highlights

CM KCR: ఎన్నికల ముందు సంగారెడ్డి జిల్లాకు కీలక పదవులు

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రాజకీయ పరిస్థితులను సరిదిద్దేందుకు పూనుకున్నారు. ఆపరేషన్ మెదక్ మొదలుపెట్టారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్న దృష్ట్యా నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టారు. రాజకీయ సమీకరణల కూడగట్టే విషయంలో సఫలమయ్యారు. జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత నరోత్తంను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

అలాగే జహీరాబాదుకు చెందిన మాజీ మంత్రి దివంగత ఫరీదుద్దిన్ కుమారుడు తన్వీర్ కు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ గా నియమించారు. గత కొంత కాలంగా అసంతృప్తి గా ఉన్న పఠాన్ చెరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ శాసనమండలి ప్రోటెం చైర్మెన్ భూపాల్ రెడ్డికి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ గా నియమించారు. ఆందోల్ కు చెందిన యువనేత మఠం భిక్షపతిని తెలంగాణ ట్రేడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories