భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్ధతు : సీఎం కేసీఆర్

భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్ధతు :  సీఎం కేసీఆర్
x
Highlights

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు.

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్‌ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ బంద్‌ విజయవంతానికి టీఆర్ఎస్‌ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories