పెళ్లి పీటలు ఎక్కనున్న సీఎం కేసీఆర్ దత్తపుత్రిక

పెళ్లి పీటలు ఎక్కనున్న సీఎం కేసీఆర్ దత్తపుత్రిక
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. పిన్నతల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురైన ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకుని తన పూర్తి...

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. పిన్నతల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురైన ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకుని తన పూర్తి భాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన పెళ్లి బాధ్యతలను కూడా సీఎం కేసీఆర్ తీసుకుని తాజాగా ఆమెకు నిశ్చితార్థం చేసారు. ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ప్రస్తుతం ప్రత్యూష సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది. వీరందరి సమక్షంలో ప్రత్యూష నిశ్చితార్థం చేసుకుంది.

మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి రాంనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటారు. కాగా చరణ్‌రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థాన్ని హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా జరిపించారు. చరణ్ రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ప్రత్యూషను కలిసి విషయం చెప్పాడు. ఆ విషయంతో ప్రత్యూష కూడా అందుకు అంగీకరించింది. ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఆ తరువాత విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్ ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. వరుడి పూర్తి వివరాలను తెలుసుకుని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్యను ప్రత్యూష నిశ్చితార్థానికి వెళ్లమని ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనర్‌ వేడుకను పర్యవేక్షించారు. తన వివాహానికి కచ్చితంగా వస్తానని కేసీఆర్‌ చెప్పారని తెలిపింది. గత ఐదేండ్లుగా విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఎదిగిన ప్రత్యూష ఇప్పుడు తనకు నచ్చిన జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని పంచుకోబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories