రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయి

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయి
x
Mallu Bhatti Vikramarka
Highlights

మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. దిశపై అత్యాచారం చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్...

మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. దిశపై అత్యాచారం చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మద్యం సేవించి మృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు, హైవేలపై ఉన్న మద్యం షాపులు తొలిగించాలన్నారు. రేపు ట్యాంక్ బండ్ నుంచి రాజ్ భవన్ వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. బెల్ట్ షాపుల రద్దు, పర్మిట్ రూల్స్ పై త్వరలో ఆందోళన చేపడుతామన్నారు.

రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 4వేల అమ్మయిలు మిస్సైనట్లు కేసులు నమోదయ్యాయని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షిణించాయని ఆరోపించారు. అసిఫాబాద్, వరంగల్ ఘటనలు ప్రజలను ఆందోళను గురిచేస్తున్నాయని, మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీ నష్టాలు ప్రభుత్వం చెల్లిస్తుందని, చెప్పి ఆ భారన్ని ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చెప్పేది చేసేదానికి పొంతన లేదని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories