తెలంగాణలో మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు

Closed Single screen theatres in Telangana
x

తెలంగాణలో మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు

Highlights

Telangana: గర్భిణిని డోలీలో తరలించిన బంధువులు

Telangana: తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడ్డాయి. ఈరోజు నుండి 10 రోజుల వరకు థియేటర్ల మూసివేతకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. మంచి సినిమాలు లేకపోవడం...ఆక్యుపెన్సీ పడిపోవడమే థియేటర్లు మూసివేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. థియేటర్‌ ఆక్యుపెన్సీ పడిపోవడంతో కనీసం కరెంట్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఒక్కషో కూడా హౌజ్‌ ఫుల్‌ కాకపోవడంతో నష్టాల్లో నడిపేకంటే మూసివేయడమే మంచిదని టీటీఏ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎన్నికల దగ్గర్నుంచి...ఇప్పటి వరకూ చిన్న థియేటర్‌ చినబోయింది. సింగిల్ స్క్రీన్‌కు వెళ్లేవాళ్లు తగ్గిపోయారు. రీ రిలీజ్‌లతో జోష్ వచ్చినా ఇప్పుడు అవి బోర్‌ కొట్టాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్లతో పాటు ఐపీఎల్‌ కూడా తోడవ్వడంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. దీంతో థియేటర్‌కు ప్రేక్షకుడు వచ్చే ఛాన్స్‌ లేకుండా పోయింది. చేసేదేంలేక థియేటర్లు మూసివేయడమే తమ దగ్గరున్న ఏకైన ఆప్షన్ అని యజమానులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories