Thummala: మాజీమంత్రి తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ

Clarity on party Change of Ex-Minister Thummala
x

Thummala: మాజీమంత్రి తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ

Highlights

Thummala: వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం

Thummala: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో గండుగులపల్లిలో పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు, అనుచరులతో తుమ్మల భేటీ కానున్నారు. వచ్చే నెలలో పాలేరు నియోజకవర్గంలో భారీ సభ ఏర్పాటుకు తుమ్మల ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories