Srisailam Fire Accident : శ్రీశైలం జెన్కో ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు వేగవంతం

Srisailam Fire Accident : శ్రీశైలం జెన్కో ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు వేగవంతం
x

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

Highlights

Srisailam Fire Accident : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Srisailam Fire Accident : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీఐడీ ఛీఫ్ గోవింద్ సింగ్ , డిఐజి సుమతి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలతో పాటు క్లూస్ టీం సభ్యులు పీఎటీ టన్నెల్ వద్దకు చేరుకుని అధికారులతో సమీక్షించారు. ఇప్పటి సీఐడీ ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందన్న ప్రాధమిక అంచనా కొచ్చింది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాధమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. సేకరించిన శ్యామ్ పుల్స్ ను ఫోరెన్సిక్ సైన్ ల్యాబ్‌కు పంపించింది. ఈ విధంగా సీఐడీ దర్యాప్తు బృందం షార్ట్ సర్క్యూట్ కి గల కారణాలను విశ్లేషించనున్నారు. కాలి పోయున వైర్ లతో పాటు పవర్ సప్లై కు ఉపయోగించిన వైర్లు, కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. చికిత్స పొందుతున్న వారి స్టేట్మెంట్‌ను సీఐడీ అధికారులు నమోదుచేసుకున్నారు. ఈ ప్రమాదం మానవ తప్పిదం వలన జరిగిందా లేదా ఏదైనా సాంకేతిక లోపం కారణంగా జరిగిందా అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.

ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పోస్టు మార్టం రిపోర్టుల్లో వారు ఊపిరితిత్తులలో దట్టంగా పొగ చేరి శ్వాస తీసుకోక ఇబ్బంది పడి చనిపోయినట్టు నిర్ధారించారు. ప్రమాద సమయంలో లోపల ఉన్న ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ సాంకేతిక కారణంగా పనిచేయలేదని, అందుకే లోపల పొగ కమ్ముకుందని అధికారులు నిర్దారించారు. అంతే కాదు ప్యానల్ బోర్డ్ కు మంటలు వ్యాపించడంతో ఎగ్జిలరీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయినట్టు గుర్తించించారు. అసలు ఈ ప్యానల్ బోర్డ్ కేంద్రంలో మంటలు ఏ విధంగా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్యానల్ బోర్డ్ కు ఎగ్జిలరీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ జరిగిన సమయాన్ని అంచనా వేస్తున్నారు.

మరో వైపు టెక్నీకల్ బృందాలు పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందో వీడియో గ్రఫీ చేసారు. దీంతో సీఐడీ పవర్ సప్లై ఎలా జరిగిందో వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సీఐడీ అధికారులు స్టేట్మెంట్ లను రికార్డ్ చేసారు. మొదట ఫైర్ యాక్సిడెంట్ ఆయిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న ప్లేస్ లో ఉన్న పదార్థాలను సేకరించారు. అదే విదంగా సీఐడీ టెక్నీకల్ బృందాలు కాలిన పదార్థాలలో వాటర్ ఉందా లేదా అన్న విషయాన్ని విశ్లేషించనున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు అంటున్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం వారు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం సంబవించడానికి మానవ తప్పిదం ఉందా లేదా అనే విషయాన్ని తేల్చనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories