తెలుగు రాష్ట్రాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు... రంగు రంగుల దీపాలతో అలంకరణ

Christmas Celebrations In Telugu States
x

తెలుగు రాష్ట్రాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు... రంగు రంగుల దీపాలతో అలంకరణ

Highlights

Christmas: చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శన

Christmas: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రార్థనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం బిషప్‌లు, పాస్టర్లు భక్తులకు దైవ సందేశం వినిపించి వ్యాకోపదేశం చేయనున్నారు.

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి అయిన మెదక్‌ సీఎస్ఐ వందో పడిలోకి అడుగుపెట్టింది. ఈ చర్చి నిర్మాణం 1914లో మొదలై ...1924లో ముగిసింది. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14లక్షలు అయినట్లు అంచనా. చర్చి 100వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏడాదిపాటు సంబురాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం వంటి ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన ప్రజాస్వామికంగా, పారదర్శకంగా కొనసాగిస్తామని అన్నారు. క్రైస్తవ కుటుంబాలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని, క్రీస్తు మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories