చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని సమావేశం.. కీలక అంశాలు ఇవే

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని సమావేశం.. కీలక అంశాలు ఇవే
x
చిరంజీవి, నాగార్జున, తలసాని
Highlights

టాలీవుడ్ అగ్రకథనాయకులు చిరంజీవి, నాగార్జున మరోసారి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఇవాళ సమావేశమైయ్యారు.

టాలీవుడ్ అగ్రకథనాయకులు చిరంజీవి, నాగార్జున మరోసారి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఇవాళ సమావేశమైయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, కళాకారులకు సంక్షేమానికి చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగిన సమావేశంలో హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శంషాబాద్‌ పరిసరాల్లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ కోసం స్థలం సేకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ , కల్చరల్‌ సెంటర్‌ కేంద్రం కోసం అవసరమైన స్థలం సేకరించాలని సూచించారు. సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం అలాగే సింగిల్‌ విండో విధానంలో సినిమాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి మంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఎఫ్‌డీ‌సీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులులతోపాటు పైరసీ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా టికెట్ల ధరల విధానం మార్పు, సీనీ టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి తలసాని అంగీకరించినట్లు తెలుస్తోంది. పైరసీ నివారణకు ప్రణాళిక రూపొందిస్తామని హామి ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories